తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్'​పై మహేశ్​, బన్నీ ఏమన్నారంటే? - జక్కన్న పై ప్రశంసలు

RRR Rajamouli: ఆర్​ఆర్​ఆర్'​ చిత్రం ఒక మాస్టర్​​ పీస్​ అంటూ హీరోలు మహేశ్​బాబు, అల్లుఅర్జున్​, దర్శకుడు సుకుమార్​ సహా పలువురు సినీప్రముఖులు కొనియాడుతున్నారు. దర్శకుడు రాజమౌళిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ఎవరెవరు ఏమంటున్నారో చూసేద్దాం...

RRR
ఆర్​ఆర్​ఆర్​

By

Published : Mar 26, 2022, 4:09 PM IST

Updated : Mar 26, 2022, 5:39 PM IST

RRR Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్​' బాక్సాఫీస్​ వద్ద సూపర్​హిట్​ టాక్​తో దూసుకెళ్తోంది. ఎన్టీఆర్​-రామ్​చరణ్​ నట విశ్వరూపం, పాత్రల మధ్య భావోద్వేగం, విజువల్​ ఎఫెక్ట్స్ సినిమాకు హైలెట్​గా నిలిచాయి.​ దీంతో చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. భారతీయ సినిమా స్థాయిని పెంచేలా ఆర్​ఆర్​ఆర్​ ఉందంటూ పలువురు హీరోలు, దర్శకులు సోషల్​మీడియా ద్వారా సలామ్​ కొడుతున్నారు. ఎవరెవరు ఏమన్నారో చూద్దాం...

"ఆర్​ఆర్​ఆర్​ టీమ్​కు అభినందనలు. రాజమౌళి మనకు గర్వకారణం, ఆయన విజన్​కు సెల్యూట్​. రామ్​చరణ్​ పట్ల గర్వపడుతున్నా. అతడు కెరీర్​ బెస్ట్​ ఫెర్మార్మెన్స్​ చేశాడు. మా బావ తారక్​.. ఒక పవర్​హౌస్​.​ నటనతో మతిపోగొట్టేశాడు. అజయ్​దేవ్​గణ్​, ఆలియా స్క్రీన్​ ప్రెజన్స్​ చాలా బాగుంది. భారతీయ సినిమాను గర్వపడేలా చేసినందుకు ధన్యవాదాలు." అని అల్లుఅర్జున్​ ట్వీట్​ చేశారు. సినిమా అసమాన అనుభూతిని అందించిందని కొనియాడారు స్టార్​ డైరెక్టర్​ శంకర్​. 'మహా రాజమౌళి' అంటూ ప్రశంసించారు.

ఎప్పటికైనా సినిమాల్లో రాజమౌళి సినిమా వేరేగా ఉంటుందని సూపర్ స్టార్ మహేశ్ బాబు అన్నారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన ఆయన ఈ వ్యాఖ్య చేశారు. "ఎన్నో చిత్రాలు ఉన్నాయి. అందులో రాజమౌళి చిత్రాలు కూడా ఉన్నాయి. వాటిలో ‘ఆర్‌ఆర్ఆర్‌’ ఎపిక్‌. భారీతనం, అద్భుతమైన విజువల్స్‌, గుండెలు పిండేసే భావోద్వేగాలు ఊహించని స్థాయిలో ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు మనల్ని మనం మరిచిపోయేలా ఉన్నాయి. అలా చేయడం అద్భుత కథకుడైన రాజమౌళి ఒక్కడి వల్లే సాధ్యం. చాలా గర్వంగా ఉంది. తారక్‌, రామ్‌చరణ్‌, స్టార్‌డమ్‌ను దాటి వెళ్లిపోయారు. తెరపై మీ ప్రదర్శన అద్భుతం. ‘నాటునాటు’స్టెప్స్‌ భూమ్మీద వేసినట్లు అనిపించలేదు. అలా గాల్లో తేలిపోతూ వేశారేమోనన్నంత కనులవిందుగా ఉన్నాయి. ప్రేక్షకులకు గొప్ప ప్రాజెక్టును అందించిన చిత్ర బృందానికి అభినందనలు" అని మహేశ్​ అన్నారు.

సుకుమార్​ ట్వీట్​

ఇదీ చూడండి: ''ఆర్‌ఆర్‌ఆర్‌' ఓ మాస్టర్‌ పీస్‌.. భారతదేశ అగ్నిపర్వతం'- సెలబ్రిటీల రివ్యూలు

Last Updated : Mar 26, 2022, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details