తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్ఆర్​ఆర్​' అభిమానులకు నిరాశ తప్పలేదు..!

తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు, యావత్‌ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అప్‌డేట్‌ కోసం సినీ ప్రేక్షకులు ఎన్నో రోజులుగా వేచిచూస్తున్నారు. అయితే తాజాగా నూతన సంవత్సరం కానుకగా ఓ పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇది చూసిన అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది.

Rajamouli RRR movie Newyear 2020 Surprise Update Here
'ఆర్​.ఆర్​.ఆర్​' అభిమానులకు నిరాశ తప్పలేదు..!

By

Published : Jan 1, 2020, 9:02 PM IST

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సర్‌ప్రైజ్‌తో అభిమానుల ముందుకు రాబోతుందని 'ఆర్​ఆర్​ఆర్​' అభిమానులు ఆశగా ఎదురుచూశారు. ఇటీవల హ్యాష్​ ట్యాగ్​లు "ఇయర్​ ఆఫ్​ ఆర్​ఆర్​ఆర్", " హ్యాపీ ఆర్​ఆర్​ఆర్​ ఇయర్​"తో 2020కి స్వాగతం చెబుదామని చిత్రబృందం ట్వీట్లతో ప్రకటించగా ఉప్పొంగిపోయారు. అయితే చెప్పినట్లు తాజాగా ఓ పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇది చూసిన అభిమానులకు మాత్రం నిరాశ తప్పలేదు.

ఆర్​ఆర్​ఆర్​ కొత్త పోస్టర్​

న్యూ ఇయర్​ కానుకగా తారక్‌, చెర్రీలకు సంబంధించి లుక్‌ను విడుదల చేస్తారని, టైటిల్​ పోస్టర్​ ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రచారం జరిగింది. అయితే వాటన్నింటికి చెక్​ పెడుతూ పాత పోస్టర్​పైనే సంవత్సరం వేసి విడుదల చేసింది చిత్రయూనిట్​. "హ్యాపీ ఆర్​ఆర్​ఆర్​ ఇయర్‌ 2020" అనే క్యాప్షన్‌ పెట్టి చిత్ర బృందం విడుదల చేయడం వల్ల... ఎన్నో ఆశలు పెట్టుకున్న రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ అభిమానులు కాస్త నిరాశపడ్డారు. అంతేకాదు ఫన్నీ మీమ్​లతో చిత్ర బృందానికి నెట్టింట కాస్త చురకలు అంటించారు. ఈ సినిమా ప్రారంభం నుంచి పలు పండగలు, చిత్రయూనిట్​లోని కీలక వ్యక్తుల పుట్టినరోజులు జరిగినా.. ఎప్పుడూ కొత్తదనంగా ఏ విశేషం చెప్పలేదు చిత్రయూనిట్​.

సినిమా ప్రారంభమయ్యాక పుట్టినరోజులు చేసుకున్న చిత్రయూనిట్​లోని ప్రముఖులు
చిత్రీకరణ తర్వాత పలు పండగలకు చిత్రబృందం అప్​డేట్​లు

జక్కన్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమరం భీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. చెర్రీకి జోడీగా అలియా భట్‌, తారక్‌కు జోడీగా ఒలివియా మోరిస్‌ నటిస్తున్నారు. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో దానయ్య నిర్మిస్తున్నాడు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి బాణీలు అందిస్తున్నారు. జులై 30న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details