తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్'​ మారథాన్ క్యాంపైన్​.. 6 రోజులు.. 9 నగరాలు - ఆర్​ఆర్​ఆర్​ విడుదల తేదీ

RRR campaign schedule: మార్చి 25న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రబృందం ప్రమోషన్స్​ను వేగవంతం చేసింది. రానున్న ఆరు రోజుల పాటు 'మారథాన్​ ప్రమోషనల్​ క్యాంపైన్' పేరుతో తొమ్మిది నగరాల్లో ప్రచారం చేయనుంది. ఈ క్యాంపైన్​కు సంబంధించిన షెడ్యూల్​ను.. ఓ ప్రత్యేక వీడియోలో రూపొందించి పోస్ట్​ చేసింది.

RRR
ఆర్​ఆర్​ఆర్​

By

Published : Mar 17, 2022, 3:36 PM IST

Updated : Mar 17, 2022, 5:21 PM IST

RRR campaign schedule: దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'ఆర్​ఆర్​ఆర్'​. దీని విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ చిత్రబృందం ప్రమోషన్స్​ వేగం పెంచుతోంది. కొంచెం కూడా ఖాళీ లేకుండా బిజీగా గడుపుతోంది. ప్రత్యేక ఇంటర్వ్యూలు, చిట్​చాట్​లు అంటూ దేశమంతటా తిరుగుతోంది. ఈ క్రమంలోనే మరోసారి ఆర్ఆర్ఆర్ ప్రచారాన్ని మరింత విస్తృతంగా నిర్వహించేందుకు దర్శకుడు రాజమౌళి ప్రణాళిక సిద్ధం చేశారు రాబోయే ఆరు రోజులను కీలకంగా తీసుకున్నారు. 'మారాథాన్​ ప్రమోషనల్​ క్యాంపైన్' చేయనున్నారు. రేపటి(మార్చి 18) నుంచి​ వరుసగా తొమ్మిది నగరాల్లో మూవీటీం ప్రచారం నిర్వహించనుంది. దానికి సంబంధించిన షెడ్యూల్​ను ఓ ప్రత్యేక వీడియో ద్వారా షేర్​ చేసింది.

హైదరాబాద్(మార్చి 18)​, దుబాయ్​(మార్చి 18), బెంగళూరు(మార్చి 19), బరోడా(మార్చి 20), దిల్లీ(మార్చి 20), అమృతసర్(మార్చి 21)​, జైపుర్(మార్చి 21)​, కోల్​కతా(మార్చి 22), వారాణాసి(మార్చి 22) మళ్లీ తిరిగి హైదరాబాద్​లో( మార్చి 23)​ ప్రత్యేక ఈవెంట్లను నిర్వహించి అభిమానులను ఉత్సాహపరచనున్నారు.. ఈ షెడ్యూల్​లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్​ను కూడా భారీగా ప్లాన్​ చేసింది. మార్చి 19న బెంగళూరులోని చిక్కబళ్లాపురలో గ్రాండ్​గా నిర్వహించనున్నట్లు తెలిపింది.

కాగా, రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో రూపొందిన ఈ చిత్రంలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లు. అజయ్​ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య నిర్మాత.

ఇదీ చూడండి: మా మధ్య బలమైన స్నేహం అలా ఏర్పడింది: తారక్-చెర్రీ​

Last Updated : Mar 17, 2022, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details