RRR movie 500crores collections: రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్'. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలి రోజే రూ.223కోట్లు సాధించి 'బాహుబలి' రికార్డులను అధిగమించిన ఈ మూవీ మూడు రోజులు పూర్తయ్యేసరికి సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.500కోట్ల వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని సినీవిశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ సోషల్‌మీడియా ద్వారా తెలిపారు.
'ఆర్‌ఆర్‌ఆర్' ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.500కోట్ల క్లబ్లో.. - ఎన్టీఆర్ రామ్‌చరణ్ ఆర్‌ఆర్‌ఆర్
RRR movie 500crores collections: ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500కోట్లు వసూళ్లను సాధించింది.
RRR movie 500 crores
యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన 'ఆర్‌ఆర్‌ఆర్'లో అల్లూరి సీతరామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా తారక్ నటించారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మించారు. కీరవాణి స్వరాలు అందించారు. ఆలియాభట్ , ఒలీవియా మోరీస్ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, అజయ్ దేవ్‌గణ్ కీలకపాత్రల్లో కనిపించారు.
ఇదీ చూడండి: Ram Gopal Varma on RRR: 'ఆర్‌ఆర్‌ఆర్'పై వర్మ షాకింగ్ కామెంట్స్
Last Updated : Mar 28, 2022, 3:19 PM IST