కెరీర్ పరంగా రామ్‌చరణ్(Ram charan), తారక్(NTR) పెద్ద స్టార్ హీరోలైనప్పటికీ బయటమాత్రం మంచి స్నేహితులని దర్శకుడు రాజమౌళి(Rajamouli) అన్నారు. రామ్‌చరణ్-తారక్‌లతో కలిసి ఆయన 'ఆర్‌ఆర్‌ఆర్' ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రేక్షకుల్లో ఉన్న సందేహాలపై చిత్రబృందం స్పందించింది. అయితే, ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.
రాజమౌళి-ఎన్టీఆర్ ఫన్నీ మూమెంట్స్ హీరోలిద్దరూ సెట్‌లో ఎలా ఉంటారో రాజమౌళి సరదాగా చెబుతున్న సమయంలో పక్కనే కూర్చొన్న తారక్ ఆయనకు చక్కిలిగింత పెట్టారు. దాంతో జక్కన్న వెంటనే సీట్‌లో నుంచి పక్కకు వెళ్లిపోయారు.
"వీళ్లిద్దరితో షూటింగ్ చేయడం ఎంత పెద్ద సమస్య అంటే.. సుమారు 300 రోజులు నేను షూట్ చేసి ఉంటే, కనీసం 25 రోజులు వీళ్లిద్దరి వల్ల వృథా అయ్యాయి" అని చెబుతున్న రాజమౌళిని పక్కనే ఉన్న తారక్ సరదాగా గిల్లారు.
వెంటనే ఉలిక్కి పడిన రాజమౌళి అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్లి మాట్లాడుతూ.. "ఇద్దరికీ 30 ఏళ్లు పైన ఉంటాయి. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. కోట్లలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ సెట్‌లో మాత్రం "జక్కన్న చరణ్ నన్ను గిల్లుతున్నాడు" అని తారక్ వచ్చి నాకు ఫిర్యాదు చేస్తాడు. చరణ్ ఏమో అమాయకంగా చూస్తూ.. "నాకు తెలీదు. నేను డైలాగ్ లైన్స్ చూసుకుంటున్నా" అని అంటాడు. సుమారు 15 నిమిషాలపాటు ఇలాగే వీళ్లిద్దరూ సరదాగా ఆటపట్టించుకుంటారు. వీళ్లిద్దర్ని నేను ఎప్పుడు ఆపాలి.." అని చెప్పేసరికి వెంటనే తారక్ స్పందిస్తూ.. "మీరు చూడలేదా? పెదరాయుడిలా అక్కడ కూర్చొని మీరేం చేశారు? నవ్వడం తప్ప. ఆరోజు నాపై జరిగిన దాడిని ఆపారా? ఖండించారా?" అని తారక్ అనేసరికి.. వెంటనే చరణ్ అందుకొని.. "ఎవరు దాడి చేశారు? అది చెప్పండి" అంటూ సరదాగా సంభాషించారు. ప్రస్తుతం ఈ సరదా సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఇవీ చదవండి: