దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్'(RRR movie) సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే పోస్డ్ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తైనట్లు చిత్ర బృందం తెలుపగా... సినిమాకు సంబంధించి ఫైనల్ కట్ పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా నిడివి సుమారు 2 గంటల 45 నిమిషాలు ఉంటుందని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. ఇటు జూ. ఎన్టీఆర్ అభిమానులు, అటు రామ్‌చరణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
RRR Update: ఆర్ఆర్ఆర్ ఫైనల్ కట్ పూర్తి.. నిడివి ఎంతో తెలుసా? - ఆర్ఆర్ఆర్ సినిమా ఫైనల్ కట్
'ఆర్ఆర్ఆర్'(RRR Update)కు సంబంధించి మరో అప్డేట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తికాగా.. ఫైనల్ కట్ అయినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.
దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో (RRR Budget) 'ఆర్ఆర్ఆర్' (RRR release date) నిర్మిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli RRR Movie Budget) తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్(Ramcharan RRR New Look ), కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ (Ntr RRR Poster) నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఆలియాభట్, ఒలీవియా మోరీస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ఇదీ చూడండి:Varudu Kaavalenu Director: 'ఈ సినిమాకు ముందు నాగ చైతన్యను అనుకున్నాను'