రోజురోజుకు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతోన్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. మహేశ్‌బాబు, అమితాబ్‌బచ్చన్ 'ఆర్‌ఆర్‌ఆర్' బృందంలో చేరుతున్నారట. కాకపోతే వాళ్లు కనిపించరు.. వినిపిస్తారంతే.
'ఆర్ఆర్‌ఆర్' సినిమా తెలుగు వెర్షన్‌కు మహేశ్, హిందీ వెర్షన్‌కు అమితాబ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట. ఈమేరకు రాజమౌళి.. అమితాబ్, మహేశ్‌తో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా 'ఆర్‌ఆర్‌ఆర్' తమిళం, మలయాళం వెర్షన్లకు ఏ హీరోలతో వాయిస్ ఓవర్ ఇప్పించాలనే విషయంలో జక్కన్న ఇంకా నిర్ణయానికి రాలేదట.