తెలంగాణ

telangana

ETV Bharat / sitara

RRR: థియేటర్ల వద్ద ఫుల్​ హంగామా.. అక్కడ జక్నన్నకు భారీ కటౌట్​

Rajamouli Huge cutout: 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రం విడుదల నేపథ్యంలో హీరోలు ఎన్టీఆర్​, రామ్​చరణ్​ కటౌట్లు​, ఫ్లెక్సీలతో పాటు దర్శకుడు రాజమౌళి కటౌట్​లు కూడా కనపడుతున్నాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్​రోడ్​లో ఏకంగా జక్నన్నకు భారీ కటౌట్ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఫ్యాన్స్​. మరోవైపు థియేటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయా సినిమా హాళ్ల యాజమాన్యం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.

RRR movie
ఆర్​ఆర్​ఆర్​

By

Published : Mar 23, 2022, 7:20 PM IST

Rajamouli Huge cutout: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్​రోడ్​లో ఎన్టీఆర్, రామ్​చరణ్​ అభిమానులు ప్రత్యేకత చాటుకున్నారు. మార్చి 25న 'ఆర్ఆర్ఆర్' విడుదల సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు రాజమౌళికి తొలిసారిగా భారీ కటౌట్ కట్టి అభిమానాన్ని చూపించారు. సంధ్య, సుదర్శన్ థియేటర్ల వద్ద చరణ్, తారక్ కటౌట్లతోపాటు రాజమౌళి కటౌట్ కనిపించడం ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. తొలిసారిగా ఓ అగ్ర దర్శకుడికి కటౌట్ కట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నగరంలోని అన్ని థియేటర్ల వద్ద ఇరు హీరోల అభిమానులు బ్యానర్లు, ప్లెక్సీలతో 'ఆర్ఆర్ఆర్' చూడటానికి వచ్చే ప్రేక్షకులకు స్వాగతం పలుకుతున్నారు.

మేకులు, ఇనుప కంచెలు

RRR movie Theatres Owners precautions: పెద్ద సంఖ్యలో అభిమానులు రానుండటం వల్ల యాజమానులు కూడా థియేటర్ల లోపల ప్రత్యేక రక్షణ చర్యలు చేపడుతున్నారు. తెర దిగువ భాగంలో బారికేడ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. తొలి రోజు ప్రేక్షకుల రద్దీ ఎక్కువగా రాబోతున్న దృష్ట్యా ప్రైవేటు సిబ్బందిని నియమించుకుంటున్నారు. సినిమా ప్రసారమయ్యే స్క్రీన్‌ వద్దకు వెళ్లి అభిమానులు సందడి చేయడం.. కొన్నిసార్లు స్క్రీన్లు చింపేసి హంగామా సృష్టించడం మనం ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. అలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్క్రీన్ల ముందు మేకులు కొట్టించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. సినిమా విడుదల రోజున థియేటర్ల వద్ద పోలీసు బందోబస్తు కావాలని కొన్ని థియేటర్ల యజమానులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి అధికారులను కోరుతున్నారు. మరోవైపు సినిమా చూసేందుకు వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునేలా థియేటర్‌ ఓనర్లతో ఆయా నటీనటుల అభిమాన సంఘాల ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు.

బారీ కేడ్లు
మేకులు
మీమర్స్​ కామెడీ

ఇదీ చూడండి: RRR: 300రోజులు.. 3వేలమంది.. రూ.500కోట్ల బడ్జెట్​!

ABOUT THE AUTHOR

...view details