'బాహుబలి' (Bahubali) సినిమాలతో తెలుగు చిత్రసీమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు దర్శకుడు రాజమౌళి. తన దర్శకత్వ ప్రతిభతో ప్రపంచ సినీప్రియుల్ని మెప్పించారు. అందుకే ఇప్పుడాయన నుంచి సినిమా వస్తుందంటే చాలు.. దేశంతో పాటు ప్రపంచ సినీప్రియులంతా ఇటు వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా 'ఆర్‌ఆర్‌ఆర్'(RRR) చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తుది దశ చిత్రీకరణలో ఉంది. ఈ సినిమా అన్ని భారతీయ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల కానున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.
S.S Rajamouli: హాలీవుడ్‌కు రాజమౌళి - విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి
'ఆర్ఆర్ఆర్'(RRR)తో ప్రస్తుతం బిజీగా ఉన్నారు దర్శకుడు రాజమౌళి. ఈ చిత్రం తర్వాత ఆయన ఓ హాలీవుడ్ మూవీ చేయబోతున్నారట. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ఈటీవీలో ప్రసారమవుతోన్న ఆలీతో సరదాగా (Alitho Saradaga) కార్యక్రమంలో పాల్గొన్ని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న ఆయన.. జక్కన్న తర్వాతి ప్రాజెక్టుల గురించి వివరించారు.
అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి ఓ హాలీవుడ్ చిత్రం చేయనున్నారట. ఈ విషయాన్ని ఆయన తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad) 'ఈటీవీ'లో ప్రసారమైన'ఆలీతో సరదాగా'కార్యక్రమంలో పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే కథ సిద్ధం చేసినట్లు తెలియజేశారు.
"రాజమౌళి కోసం ఓ కథ రాశా. లైవ్ యానిమేషన్ విధానంలో తెరకెక్కనుంది. ఇండియన్ కంటెంట్‌తో అంతర్జాతీయ ప్లాట్‌ఫాం కోసం రూపొందించనున్న భారీ చిత్రమది. ఓ ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ నిర్మితం కానుంది" అని విజయేంద్రప్రసాద్ ఆ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. అయితే ఇది ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్లనుందన్నది స్పష్టత ఇవ్వలేదు.