బాహుబలి.. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఒక్కో మైలురాయిలా ఉంటుంది. ముఖ్యంగా మొదటి భాగంలో వచ్చే ఇంటర్వెల్ సీన్ అద్భుతం. మాహిష్మతి సామ్రాజ్యంలోకి శివుడు(ప్రభాస్) అడుగుపెట్టే సన్నివేశం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ సన్నివేశం ఎందుకు తీయాల్సి వచ్చిందో వివరించాడు రాజమౌళి. అప్పటి వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
'బాహుబలి ఇంటర్వెల్ వేరేలా తీయాలనుకున్నా'
బాహుబలి-ద బిగినింగ్ చిత్రంలోని ఇంటర్వెల్ సన్నివేశంపై ఓ కీలక విషయం వెల్లడించాడు దర్శకధీరుడు రాజమౌళి. మొదట వేరే విధంగా తీయాలనుకొన్నా.. తర్వాత స్వల్పమార్పులతో తెరకెక్కించినట్లు ఆయన చెప్పాడు.
నీటిలో నుంచి తోసుకుంటూ.. భూమిని చీల్చుకుంటూ, నిప్పులు దాటుకుంటూ, గాల్లో ఎగిరి ఆకాశం నుంచి దూకుతూ మాహిష్మతి సామ్రాజ్యంలో అడుగుపెడతాడు శివుడు. ఇలా పంచ భూతాలను అధిగమించి వచ్చే సన్నివేశంతో ఇంటర్వెల్ బ్రేక్ ఇచ్చామని చెప్పాడు జక్కన్న.
అంతేకాకుండా ఇంటర్వెల్ భాగాన్ని మొదట వేరేవిధంగా తీయాలని అనుకున్నాడట రాజమౌళి. అయితే స్వల్ప మార్పులతో సినిమాలో సీన్ చిత్రీకరించామని చెప్పాడు జక్కన్న. నటీనటులు ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యారాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా 2015లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.