తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్'​ షూటింగ్ ఆ రోజు మానేస్తా: రాజమౌళి - MATHU VADALARA TRAILER

ఈనెల 25న రానున్న 'మత్తు వదలరా' సినిమా కోసం, ఆరోజు 'ఆర్​ఆర్ఆర్' షూటింగ్​ మానేస్తానని ట్వీట్ చేశాడు దర్శకధీరుడు రాజమౌళి.

'ఆర్​ఆర్​ఆర్'​ షూటింగ్ ఆ రోజు మానేస్తా: రాజమౌళి
దర్శకధీరుడు రాజమౌళి

By

Published : Dec 19, 2019, 11:18 AM IST

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి.. తాను తెరక్కెక్కిస్తున్న 'ఆర్ఆర్​ఆర్' షూటింగ్​కు డుమ్మా కొడతానంటున్నాడు. ఈ క్రిస్మస్​న చిత్రీకరణకు వెళ్లనంటున్నాడు. అందుకు కారణం 'మత్తు వదలరా' సినిమా అదే రోజు విడుదలవుతుండటం. ఈ చిత్ర ట్రైలర్​ను ట్విట్టర్​లో పంచుకొని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ సినిమాతో సంగీత దర్శకుడు కీరవాణి కొడుకులు శ్రీసింహ, కాలభైరవ.. హీరోగా, సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

అతినిద్ర వల్ల ఓ డెలివరీ బాయ్ ఎదుర్కొనే సమస్యల ఆధారంగా 'మత్తు వదలరా' సినిమా తీశారు. ట్రైలర్​ను రానా.. గురువారం విడుదల చేశాడు. ఆద్యంతం ఆసక్తి రేపుతూ అంచనాల్ని పెంచుతోంది. రితేశ్ రానా దర్శకత్వం వహించాడు. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: అయ్యో.. జక్కన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' టైటిల్‌ కొట్టేశారట!

ABOUT THE AUTHOR

...view details