'ఆర్ఆర్ఆర్'తో బిజీగా ఉన్న రాజమౌళి.. తర్వాత సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో కలిసి పనిచేయనున్నారు. ఈ చిత్రకథ గురించి కొన్నాళ్ల నుంచి పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అడ్వెంచర్ సినిమా చేయనున్నారని, ఆఫ్రికా అడవుల నేపథ్యంగా కథ ఉండనుందని మాట్లాడుకుంటున్నారు. ఈ విషయమై రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ క్లారిటీ కూడా ఇచ్చారు.
ఆఫ్రికా అడవుల నేపథ్యంలో కథ?
ప్రస్తుతం పలు కథలు అనుకుంటున్నామని, ఆఫ్రికా అడవుల నేపథ్యం గురించి కూడా ఆలోచిస్తున్నట్లు విజయేంద్రప్రసాద్ అన్నారు. త్వరలో దీనిపై స్పష్టత వస్తుందని తెలిపారు.
రాజమౌళి కెరీర్లో తొలిసారి అలా..
ఒకవేళ ఆఫ్రికా అడవుల్లో జరిగే అడ్వెంచర్ కథే గనుక మహేశ్ సినిమాకు ఖరారైతే మాత్రం ఎస్.ఎస్. రాజమౌళి కెరీర్లో విభిన్న ప్రయత్నం అవుతుంది! ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ప్రాంతీయ నేపథ్యంగానే తెరకెక్కించారు. మహేశ్‌తో రాజమౌళి చేయబోయే ప్రాజెక్టు మాత్రం పూర్తిస్థాయిలో విదేశాల్లో చిత్రీకరణ జరగబోయే సినిమా అవుతుంది. ఈ ఏడాది చివర్లో లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ప్రాజెక్టు షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.