దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తన సినిమాల్లో అప్పుడప్పుడు తళుక్కున మెరుస్తుంటారు. 'బాహుబలి' తొలి భాగంలోని ప్రత్యేకగీతంలో ప్రభాస్, రానాతో కలిసి సందడి చేశారు. అంతకుముందు 'మగధీర'లోనూ చివరిగా వచ్చే పాటలో ఆయన ఆడిపాడారు. అలా 'ఆర్‌ఆర్‌ఆర్'లోనూ ఆయన ఓ పాటలో మెరుస్తారని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్న ఓ పాటలో రామ్‌చరణ్, ఎన్టీఆర్, అలియాభట్‌లతో కలిసి రాజమౌళి కాలు కదుపుతున్నారు. ప్రేమ్‌రక్షిత్ నృత్య దర్శకత్వం వహిస్తున్న ఆ పాట చిత్రీకరణ మరో రెండు రోజులపాటు సాగుతుంది.
'మగధీర', 'బాహుబలి'.. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్'లో! - ram charan ntr RRR
స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. మరోసారి తెరపై మెరవనున్నారు. హీరోహీరోయిన్లతో కలిసి డ్యాన్స్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది!
రాజమౌళి
అనంతరం ఉక్రెయిన్‌లో ఓ పాటని తెరకెక్కించనున్నారు. దాంతో చిత్రీకరణ పూర్తవనున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్'లో బాలీవుడ్ తారలు అలియాభట్, అజయ్ దేవగణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఆ పాటల్ని పూర్తి చేసి ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టనుంది చిత్రబృందం. దసరా సందర్భంగా అక్టోబరు 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
ఇవీ చదవండి: