బాహుబలి: ది బిగినింగ్, రోబో 2.0 లాంటి చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్గా పనిచేసిన శ్రీనివాస్ మోహన్‌కు ఆస్కార్ అకాడమీ నుంచి పిలుపు వచ్చింది. ఆస్కార్ ఎంపిక కమిటీలో ఈయనకు చోటు దక్కింది. దీనిపై స్పందించిన రాజమౌళి.. శ్రీనివాస్ మోహన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
శ్రీనివాస మోహన్‌పై రాజమౌళి ప్రశంసలు - srinivasa mohan
ప్రముఖ విజువల్ ఎఫెక్ట్ సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్‌కు ఆస్కార్ అకాడమీ నుంచి ఆహ్వనం అందింది. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశారు.
రాజమౌళి
"ఎంతో మంది విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్లు ఉన్నప్పటికీ ప్రతిష్టాత్మక ఆస్కార్ అకాడమీ నుంచి మీకు ఆహ్వానం అందినందుకు కంగ్రాట్స్ సర్" - రాజమౌళి ట్వీట్
బాలీవుడ్ సినీప్రముఖులు అనుపమ్ ఖేర్, అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, రితేశ్ బాత్రాలకు కూడా అకాడమీ ఆహ్వానం అందింది. వీరు ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్లు దక్కించుకునే చిత్రాలను పరిశీలించి విజేతలను ఎంపిక చేసే కమిటీలో భాగస్వాములు కానున్నారు.