లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడం వల్ల సెలబ్రిటీలందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం 'అర్జున్‌రెడ్డి' చిత్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా తన సతీమణికి ఇంటి పనుల్లో సాయం చేస్తున్న ఓ వీడియోను చిత్రీకరించి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ.. రాజమౌళికి ఛాలెంజ్ విసిరారు. సందీప్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన రాజమౌళి సోమవారం వీడియోను అప్‌లోడ్ చేస్తానని చెప్పారు.
తారక్, చరణ్‌కు రాజమౌళి సవాల్ - be the real men challenge rajamouli
దర్శకధీరుడు రాజమౌళి 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఛాలెంజ్‌ను స్వీకరించారు. ఇంట్లో తన సతీమణి రమా రాజమౌళికి సాయం చేశారు. ఈ వీడియోను నెట్టింట షేర్ చేశారు.
తాజాగా జక్కన్న చెప్పినట్లుగానే తన సతీమణి రమా రాజమౌళికి ఇంటి పనుల్లో సాయం చేస్తున్న ఓ వీడియోను నేడు ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఇంట్లోని గదులు, తలుపులు, కిటికీలను శుభ్రం చేశారు. "సందీప్‌రెడ్డి వంగా నువ్వు ఇచ్చిన టాస్క్ పూర్తి చేశాను. తారక్, రామ్‌చరణ్‌తోపాటు శోభూ యార్లగడ్డ, సుకుమార్, కీరవాణికి ఈ ఛాలెంజ్ విసురుతున్నాను." అని జక్కన్న పోస్ట్ చేశారు. వెంటనే స్పందించిన ఎన్టీఆర్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. చెర్రీ సరసన బాలీవుడ్ నటి ఆలియాభట్, తారక్ సరసన హాలీవుడ్ నటి ఒలివియా మోరీస్ సందడి చేయనున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు.