తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలయ్య ఓ ఆటమ్ బాంబు: రాజమౌళి - akhanda movie budget

Jai balayya song released: దర్శకుడు బోయపాటి తెరకెక్కించిన 'అఖండ' సినిమాలోని 'జై బాలయ్య' సాంగ్​ను రిలీజ్​ చేశారు దర్శకధీరుడు రాజమౌళి. ఈ గీతంలో బాలయ్య, ప్రగ్యా జైశ్వాల్​ అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నారు.

అఖండ ప్రీ రిలీజ్​ ఈవెంట్​, Jai balayya song released, Balakrishna Akhanda Pre release event
అఖండ ప్రీ రిలీజ్​ ఈవెంట్​

By

Published : Nov 27, 2021, 9:17 PM IST

Updated : Nov 27, 2021, 9:29 PM IST

Akhanda pre release event: బోయపాటి దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'అఖండ' సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​ ఘనంగా జరుగుతోంది. అల్లు అర్జున్​, దర్శకధీరుడు రాజమౌళి ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. హైదరాబాద్​లోని శిల్పకళా వేదికలో ఈ ఈవెంట్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని 'జై బాలయ్య' సాంగ్​ను జక్కన్న విడుదు చేశారు. ఇందులో బాలయ్య, ప్రగ్యా స్టెప్పులు అదిరిపోయాయి.

"అఖండ చిత్రంతో సినీ పరిశ్రమకు జోష్ తీసుకొచ్చినందుకు బోయపాటికి థ్యాంక్యూ. ఈ సినిమా డిసెంబర్ 2 నుంచి థియేటర్లలో ప్రేక్షకులకు ఇంతే ఆనందాన్ని కలిగించాలని కోరుకుంటున్నా. బాలయ్య బాబు ఓ ఆటమ్ బాంబు. దానిని ఎలా ప్రయోగించాలో బోయపాటికి తెలుసు. దాని గురించి మీరు అందరికీ చెప్పాలి. బాలయ్య.. మీ ఎనర్జీ సీక్రెట్ ఏంటో చెప్పాలి. థియేటర్లో 'అఖండ' పాత్ర ఇంట్రడక్షన్ చూడటం కోసం నేను కూడా ఎదురుచూస్తున్నా. ఈ సినిమా పెద్ద హిట్టై తెలుగు సనీ పరిశ్రమకు కొత్త ఊపు తీసుకురావాలి"

-రాజమౌళి, దర్శకుడు

బాలయ్య స్ఫూర్తి

"అందరికీ నమస్కారం 'జై బాలయ్య'. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. 'అఖండ' సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించడం అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. నన్ను ఈ సినిమా కోసం ఎంపికచేసినందుకు ధన్యవాదాలు. బాలకృష్ణ ఎంతో పాజిటివ్​, ఎనర్జీగా ఉంటారు. ఆయన ఓ స్ఫుర్తి. అల్లుర్జున్​, రాజమౌళికి ప్రత్యేక ధన్యవాదాలు. చిత్రబృందానికి కృతజ్ఞతలు. ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఆదరించి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను."

-ప్రగ్యాజైశ్వాల్​.

చాలా సంతోషంగా ఉంది

తాను మొదటిసారి డ్రమ్స్‌ వాయించింది బాలకృష్ణ నటించిన 'భైరవద్వీపం' చిత్రానికేనని, ఆ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని సంగీత దర్శకుడు తమన్‌ అన్నారు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు తమని తాము మైమరిపోతారని బాలకృష్ణ నటన హైలైట్‌గా ఉంటుందని చెప్పారు. నందమూరి బాలకృష్ణ సినిమాకు పాడే అవకాశం వచ్చినందుకు గాయకుడు ఎస్పీ చరణ్‌ కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆస్పత్రిలో ఉండగా, కోలుకోవాలని బాలకృష్ణ పూజలు, అర్చనలు చేయించారని, ఆ మేలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. అందుకు ఇప్పుడు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.

ఈ చిత్రంలో బాలయ్య అఘోరాగా విభిన్న పాత్రలో కనిపించనున్నారు. ప్రగ్యా హీరోయిన్​గా చేసింది. శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించారు. మిర్యాల రవీందర్​రెడ్డి నిర్మించారు.

ఇదీ చూడండి: కథ వినకుండానే 'అఖండ' చేశా: హీరోయిన్ ప్రగ్యా

Last Updated : Nov 27, 2021, 9:29 PM IST

ABOUT THE AUTHOR

...view details