తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Rajamouli: ఆందోళన చెందొద్దు.. అజాగ్రత్తగా ఉండొద్దు - కొవిడ్ 19 జాగ్రత్తలపై రాజమౌళి

కరోనా సెకండ్​ వేవ్​లో ఎక్కువ శాతం కేసులు నమోదైనప్పటికీ దేశ జనాభాతో పోల్చితే చాలా తక్కువన్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి (s.s rajamouli). మూడో దశలో ఎవరికి ఎలాంటి ముప్పు పొంచి ఉంది, ఎలా అప్రమత్తమవ్వాలనే అంశాలపై లిటిల్ స్టార్ హెల్త్ కేర్ వైద్యులు డాక్టర్ జి.సతీష్​తో వర్చువల్ పద్ధతిలో రాజమౌళి ప్రత్యేకంగా చర్చించారు.

rajamouli
రాజమౌళి

By

Published : May 31, 2021, 4:10 PM IST

కరోనా వైరస్ మూడో దశ ఎంత ఉద్ధృతంగా ఉన్న పిల్లలను రక్షించుకోగలమనే నమ్మకం తల్లిదండ్రుల్లో ఉండాలని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (s.s rajamouli) సూచించారు. ఇటీవల ఐసీఎంఆర్ ప్రకటించిన అంశాల ప్రకారం మూడో దశలో పిల్లలపై ప్రభావం చూపుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పేర్కొన్న ఆయన.. గతంలో కంటే ఈసారి ఎక్కువ శాతం కేసులు నమోదైనప్పటికీ దేశ జనాభాతో పోల్చితే చాలా తక్కువన్నారు.

డాక్టర్ జి.సతీష్​తో వర్చువల్ సమావేశంలో రాజమౌళి

మూడో దశలో ఎవరికి ఎలాంటి ముప్పు పొంచి ఉంది, ఎలా అప్రమత్తమవ్వాలనే అంశాలపై లిటిల్ స్టార్ హెల్త్ కేర్ వైద్యులు డాక్టర్ జి.సతీష్​తో వర్చువల్ పద్ధతిలో రాజమౌళి ప్రత్యేకంగా చర్చించారు. ఆన్​లైన్ వేదికగా ప్రజలు వ్యక్తం చేసిన సందేహాలను డా.సతీష్ దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేశారు. అయితే కొవిడ్ బారినపడ్డామని ఆందోళన చెందవద్దని.. కొవిడ్ నుంచి కోలుకున్నామని అజాగ్రత్తగా ఉండకూడదని జక్కన్న విజ్ఞప్తి చేశారు. నిర్ధరణ పరీక్షల ప్రాధాన్యత కంటే సత్వరమే కరోనా లక్షణాలను గుర్తించి వైద్యులను సంప్రదించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details