RRR Rajamouli: ఇప్పుడు ఎక్కడచూసినా 'ఆర్ఆర్ఆర్' మేనియానే నడుస్తోంది. ఇందులో భాగంగా ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది చిత్రబృందం. దేశవ్యాప్తంగా తిరుగుతూ ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో పాల్గొంటూ, చాలా ఇంటర్వ్యూల్లో ఇస్తూ దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు రాజమౌళి.. సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
"సినిమాలోని ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం 65 రాత్రులు షూటింగ్ చేశాం. ఒక్కోరోజు దాదాపు రూ.75 లక్షలు ఖర్చయింది. దేశం మొత్తంలోని పలు ప్రాంతాలకు చెందిన వందలాది మంది ఆర్టిస్టులు ఈ సీక్వెన్స్‌లో పాల్గొన్నారు" అని రాజమౌళి చెప్పారు.