తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్'​లో అదిరిపోయే సీన్.. సీక్రెట్ రివీల్ చేసిన జక్కన్న - అలియా భట్

Rajamouli: 'ఆర్​ఆర్​ఆర్'​ ట్రైలర్​తో సినిమాపై అంచనాలు అంబరాన్నంటాయి. సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి అదిరిపోయే ఓ సీక్రెట్​ను పంచుకున్నారు దర్శకుడు రాజమౌళి.

Rajamouli RRR
ఆర్​ఆర్​ఆర్

By

Published : Dec 20, 2021, 11:23 AM IST

Rajamouli: జూనియర్​ ఎన్టీఆర్​-రామ్​చరణ్ కాంబినేషన్​లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్​ఆర్​ఆర్'​. ఈ సినిమాపై ఆది నుంచి భారీగా ఉన్న అంచనాలు.. ఇటీవలే విడుదలైన ట్రైలర్​తో పతాకస్థాయికి చేరాయి. ఇక వచ్చే మూడు వారాల పాటు 'ఆర్​ఆర్​ఆర్'​ సందడి ఓ రేంజ్​లో ఉండబోతోంది అంటూ ఇటీవలే చిత్రబృందం చేసిన ప్రకటన అభిమానుల్లో ఉత్సహాన్ని నింపింది. సినిమా గురించి ఎలాంటి విశేషాలను వెల్లడిస్తారో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

'ఆర్​ఆర్​ఆర్​' ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో చిత్రబృందం

ఈ క్రమంలోనే ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు రాజమౌళి. ముంబయిలో ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో ఫ్యాన్స్​కు గూస్​బంప్స్​ను తెప్పించే సీన్​ గురించి మాట్లాడారు.

"ఆర్​ఆర్​ఆర్'​లో ఒక ప్రత్యేకమైన సన్నివేశం ఉంది. అది ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. ప్రస్తుతానికి ఈ సన్నివేశాన్ని సీక్రెట్​గానే ఉంచుతున్నా. దానిని థియేటర్లలోనే అనుభూతి చెందాలి."

-ఎస్​ఎస్​ రాజమౌళి, దర్శకుడు

'ఆర్​ఆర్ఆర్​'లో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషించారు.

పాన్ ఇండియా స్థాయిలో జనవరి 7న రిలీజయ్యే ఈ సినిమాకు కీరవాణి సంగీతమందించారు. ఇప్పటికే వచ్చిన పాటలన్నీ.. శ్రోతల్ని అలరిస్తూ చిత్రంపై అంచనాల్ని పెంచుతున్నాయి. డీవీవీ దానయ్య రూ.450 కోట్లతో ఈ సినిమాను నిర్మించారు.

ఇవీ చూడండి:

'ఆర్ఆర్ఆర్' రిలీజ్.. ఎవరూ ఆ సాహసం చేయొద్దు: సల్మాన్​ఖాన్

RRR movie: రాబోయే మూడు వారాలు రచ్చ రచ్చే!

RRR trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. సరికొత్త రికార్డు

ABOUT THE AUTHOR

...view details