టాలీవుడ్‌లో మళ్లీ హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు టైం వచ్చినట్లుంది. తాజాగా రాజారవీంద్ర ప్రధానపాత్రలో, దీక్షిత్ శెట్టి, శ్వేతా వర్మ ఇతర తారాగణంగా 'ది రోజ్ విల్లా' తెరకెక్కింది. సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్: భయపెడుతోన్న 'ది రోజ్ విల్లా' - భయపెడుతోన్న ది రోజ్ విల్లా
రాజా రవీంద్ర, దీక్షిత్ శెట్టి, శ్వేతా వర్మ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ది రోజ్ విల్లా'. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.
భయపెడుతోన్న 'ది రోజ్ విల్లా'
"ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారా" అనే డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్‌కు గురిచేసేలా ఉంది. "మనం ప్రేమించినోళ్లు మన కళ్ల ముందే చనిపోతుంటే.. ఏం చేయలేని పరిస్థితుల్లో నువ్వుంటే అది ఎంత నరకంగా ఉంటుందో తెలుసా నీకు" అని రాజారవీంద్ర పాత్ర పలికే సంభాషణలు చాలా మిస్టరీయస్‌గా అనిపిస్తున్నాయి. హేమంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చిత్రమందిర్ స్టూడియో పేరుతో అచ్యుతరామారావు నిర్మిస్తున్నారు.