విభిన్న కథలతో ప్రేక్షకుల్ని అలరిస్తోన్న యువ నటుడు శ్రీ విష్ణు (Sri Vishnu). ప్రస్తుతం ఇతడు నటిస్తోన్న కామెడీ ఎంటర్టైనర్ 'రాజ రాజ చోర' (Raja Raja Chora). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. యూట్యూబ్ స్టార్ గంగవ్వ వాయిస్ ఓవర్‌తో రూపొందించిన ఈ వీడియో ఆకట్టుకునేలా ఉంది. ఓ రాజు, దొంగకు సంబంధించిన కథతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ నెల 18న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నారు.
Raja Raja Chora: గంగవ్వ చెప్పిన 'చోర గాథ' విన్నారా? - రాజరాజ చోర ప్రమోషనల్ వీడియో
శ్రీ విష్ణు (Sri Vishnu) హీరోగా రూపొందుతోన్న కామెడీ ఎంటర్టైనర్ 'రాజ రాజ చోర'(Raja Raja Chora). తాజాగా ఈ సినిమా ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు. గంగవ్వ వాయిస్ ఓవర్‌తో రూపొందించిన ఈ వీడియో ఆకట్టుకునేలా ఉంది.
రాజ రాజ చోర
ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన మేఘా ఆకాశ్, సునయన హీరోయిన్లుగా నటిస్తున్నారు. హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నారు టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.