స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం 'అల వైకుంఠపురములో'. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న సుశాంత్ లుక్నుఆదివారం విడుదల చేశారు. రాాజ్ అనే పాత్రలో క్లాస్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడీ నటుడు.
'అల వైకుంఠపురములో' నుంచి మరో క్లాసీ లుక్ - అల్లు అర్జున్ కొత్త సినిమా
'అలవైకుంఠపురములో' చిత్రంలో నుంచి సుశాంత్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. రాాజ్ అనే పాత్రలో కనిపించనున్నాడీ నటుడు.
'అల వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్
ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తోంది. ఇతర పాత్రల్లో టబు, జయరాం, నవదీప్ తదితరులు కనిపించనున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: 'సామజవరగమన'.. సరికొత్త రికార్డు