తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Raj Kundra news: కుంద్రా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! - పోర్నగ్రఫీ కేసు

అశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన రాజ్​కుంద్రా(Raj Kundra news)కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన దగ్గర పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు కుంద్రాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమయ్యారు.

raj kundra, kundra image
రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి భర్త

By

Published : Jul 25, 2021, 5:06 PM IST

అశ్లీల చిత్రాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన వ్యాపారవేత్త, నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా(Raj Kundra news)కు సంబంధించిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా.. ఆయనకు సంబంధించిన వియాన్​ ఇండస్ట్రీస్​లో పనిచేసే నలుగురు ఉద్యోగులు కుంద్రాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమయ్యారు. దర్యాప్తునకు కుంద్రా సహకరించని నేపథ్యంలో.. పోర్న్​ రాకెట్​కు సంబంధించిన వివరాలు ఈ నలుగురు ఉద్యోగులు అందజేసినట్లు ముంబయి పోలీసులు స్పష్టం చేశారు.

ఇటీవలే రాజ్​కుంద్రా, ఆయన భార్య శిల్పాశెట్టిని గంటల పాటు విచారించారు ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. రాజ్‌కుంద్రా వ్యాపారాల గురించి శిల్పాశెట్టిని ప్రశ్నించారు. కుంద్రా చేస్తున్న అశ్లీల చిత్రాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్‌లో ఆమెకు ఏమైనా వాటా ఉందా? అని ఆరా తీసినట్లు సమాచారం.

అనంతరం.. కుంద్రాకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు, ప్రింటర్, ల్యాప్​టాప్​ను సీజ్​ చేశారు పోలీసులు.

ABOUT THE AUTHOR

...view details