అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన ప్రముఖ పారిశ్రామికవేత్త రాజ్‌కుంద్రా.. పోలీసులకు భారీ మొత్తంలో లంచం ఇచ్చారని తెలుస్తోంది. ఈ విషయాన్ని అవినీతి నిరోధక శాఖ వెల్లడించింది. ఇదే కేసులో అరెస్టయిన యష్ ఠాకుర్ నుంచి తమకు నాలుగు ఈమెయిల్స్ వచ్చాయని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. రూ. 25 లక్షలు లంచం ఇచ్చినట్లు అందులో ఉందని తెలిపారు. వీటిని ముంబయి పోలీసులకు ఫార్వర్డ్ చేశామని, త్వరలో వారు దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారని వెల్లడించారు.
ఆశ్లీల చిత్రాల కేసులో సోమవారం(జులై 19) రాత్రి రాజ్ కుంద్రాతో పాటు మరో 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనకు సంబంధించిన ఒక్కో విషయం బయటకొస్తోంది.