తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Raj Kundra: పోర్న్ ద్వారా వచ్చిన లాభాలు బెట్టింగు​ల్లో!

అశ్లీల చిత్రాల వ్యాపారం కేసులో ప్రముఖ వ్యాపారవేత్త రాజ్​కుంద్రాను కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. మరికొన్ని వివరాలు సేకరించేందుకు మరో ఏడు రోజులు కస్టడీకి కోరారు. అలాగే పోర్న్ చిత్రాల ద్వారా వచ్చిన డబ్బును ఆన్​లైన్ బెట్టింగ్ కోసం రాజ్​కుంద్రా ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Raj Kundra
రాజ్ కుంద్రా

By

Published : Jul 23, 2021, 3:16 PM IST

Updated : Jul 23, 2021, 3:29 PM IST

అశ్లీల చిత్రాల వ్యాపారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త రాజ్​కుంద్రా, ర్యాన్ తోర్పేలను .. మహారాష్ట్రలోని మెజిస్ట్రేట్​ కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. ఇంకా కీలక అంశాలు వెలుగులోకి రావాల్సి ఉందని, మరో ఏడు రోజులు వారికి కస్టడీకి కోరారు. దీనిపై స్పందించిన కోర్టు వారికి జులై 27 వరకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అలాగే పోర్న్ చిత్రాల ద్వారా వచ్చిన డబ్బును ఆన్​లైన్ బెట్టింగ్​లకు ఉపయోగించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ వాట్సప్ చాట్​లో 121 వీడియోలు 1.2 మిలియన్ డాలర్లకు అమ్మకానికి పెట్టినట్లు తెలిసిందని పేర్కొన్నారు. ఇది ఒక ఇంటర్నేషనల్ డీల్ అని.. ఈ విషయంలో కుంద్రాకు చెందిన యెస్ బ్యాంక్, యూనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్రికా నగదు బదిలీలను పరిశీలించాలని నిర్ణయించామని వెల్లడించారు.

తప్పించుకునేందుకు లంచం!

అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్​కుంద్రా.. పోలీసులకు భారీ మొత్తంలో లంచం ఇచ్చారని తెలుస్తోంది. ఈ విషయాన్ని అవినీతి నిరోధక శాఖ వెల్లడించింది. ఇదే కేసులో అరెస్టయిన యష్ ఠాకుర్​ నుంచి తమకు నాలుగు ఈమెయిల్స్ వచ్చాయని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. రూ. 25 లక్షలు లంచం ఇచ్చినట్లు అందులో ఉందని తెలిపారు. వీటిని ముంబయి పోలీసులకు ఫార్వర్డ్​ చేశామని, త్వరలో వారు దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారని వెల్లడించారు.

ఇవీ చూడండి:భర్త అరెస్ట్​ తర్వాత తొలిసారి శిల్పా శెట్టి పోస్ట్​

Last Updated : Jul 23, 2021, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details