తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'శ్యామ్​ సింగరాయ్​'లో నానికి పోటీగా మరో హీరో! - నాని శ్యామ్​ సింగరాయ్

నేచురల్​ స్టార్​ నాని హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'శ్యామ్​ సింగరాయ్​'. ఇందులో మరో కీలకపాత్ర కోసం యువ నటుడు రాహుల్​ రవీంద్రన్ ఎంపికయ్యారు. ​

Rahul Ravindran to play a key role in Shyam Singha Roy
'శ్యామ్​ సింగరాయ్​'లో నానికి పోటీగా మరో హీరో!

By

Published : Mar 23, 2021, 1:21 PM IST

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం 'శ్యామ్‌ సింగరాయ్‌'. రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మరో యువ కథానాయకుడు కనిపించబోతున్నారు. ఆయనెవరో కాదు నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌. ఇందులో ఆయన సహాయక పాత్ర పోషిస్తున్నారు.

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ నాయికలుగా నటిస్తున్నారు. మిక్కీ జె. మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

'శ్యామ్​ సింగరాయ్​' ఫస్ట్​లుక్

కోల్‌కతా నేపథ్యంలో సాగుతుందీ చిత్రం. ఇటీవలే విడుదలైన నాని ఫస్ట్‌లుక్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటివరకు కనిపించని లుక్‌లో దర్శనమిచ్చి అందరి దృష్టినీ ఆకర్షించాడు నాని. మరి రాహుల్‌ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇదీ చూడండి:'ఆ హీరో అనుకుని నన్ను ఆడిషన్​కు పిలిచారు'

ABOUT THE AUTHOR

...view details