హీరో నవీన్ పోలిశెట్టిపై నటుడు రాహుల్ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవీన్‌కు వార్నింగ్ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. నవీన్, రాహుల్, ప్రియదర్శి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'జాతిరత్నాలు'. ప్రస్తుతం ఈ సినిమా విజయోత్సవ వేడుకల్లో చిత్రబృందం హుషారుగా పాల్గొంటోంది. ఇందులో భాగంగానే నవీన్, ప్రియదర్శి ఇటీవలే అమెరికా వెళ్లారు. న్యూజెర్సీలో జరిగిన సక్సెస్‌టూర్‌కు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ స్వప్నా సినిమాస్ అభిమానులతో పంచుకుంది. అయితే, ఆ వీడియో చూసిన రాహుల్.. తనను తీసుకువెళ్లకుండా నవీన్, ప్రియదర్శి యూఎస్ వెళ్లడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ సరదా వీడియోను విడుదల చేశారు.
"అరేయ్ దర్శి, నవీన్.. పీపుల్స్ ప్లాజాలో సక్సెస్‌మీట్ అయ్యాక.. మిమ్మల్ని కలిసేలోపే పాస్‌పోర్ట్‌తో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి.. విమానమెక్కి యూఎస్ వెళ్లిపోతారేరా.! నేను చెప్పా కదరా.. నా దగ్గర కూడా పాన్ కార్డ్ ఉందని. పాన్‌కార్డు చూపిస్తే అక్కడ ఎంట్రీ ఇస్తార్రా..! జోగిపేట రవిరా నేను. నా వల్లే ప్రాబ్లమ్ అవుతుందని నన్ను వదిలేసి వెళ్లిపోయారు కదరా! మీరు రండ్రా మీ సంగతి చెబుతా..!" అంటూ రాహుల్ ఓ సరదా వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.