తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మార్వెల్ యాంథమ్'తో అదరగొట్టిన రెహమాన్ - ar rahman

హాలీవుడ్ చిత్రం 'అవెంజర్స్ ఎండ్ గేమ్' కోసం ఏఆర్ రెహమాన్ ఓ పాట రూపొందించారు. మార్వెల్ యాంథమ్​గా ఈ సాంగ్​ను విడుదల చేసింది చిత్రబృందం.

ఏఆర్ రెహమాన్

By

Published : Apr 2, 2019, 9:32 AM IST

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో మార్వెల్ యాంథమ్​ను ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రూపొందించారు. ఇందులో రెహమాన్‌ మార్వెల్‌ సూపర్‌ హీరోల సాహసం గురించి పాడుతూ కనిపించారు. "ప్రపంచం రేపటితో అంతం అయిపోవచ్చు.. కానీ వారసత్వం ఎప్పటికీ జీవంతో ఉంటుందని" సాగే ఈ పాట అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న 'అవెంజర్స్ ఎండ్​ గేమ్'​ చిత్రానికి ఆంటోని రసో, జోయ్ రసో సంయుక్తంగా దర్శకత్వం వహించారు. గత ఏడాది వచ్చిన అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్​కు సీక్వెల్​గా తెరకెక్కిందీ చిత్రం. రాబర్ట్​ డౌనీ జూనియర్, క్రిస్​ ఇవాన్స్, మార్క్ రఫోలో, క్రిస్​ హేమ్స్​వర్త్​, స్కార్లెట్​ జాన్సన్, జెర్మీ రెన్నర్​, పాల్ రూడ్ లాంటి​ భారీ తారాగణం ఈ సినిమాలో నటించారు.

ఇవీ చూడండి..డ్యాన్స్​తో కుర్రకారు మతిపోగొట్టిన కియారా

ABOUT THE AUTHOR

...view details