కారాగారంలో తాను జారి పడి గాయపడ్డానని, ప్రైవేటు వైద్యశాలలో చికిత్సకు అవకాశం ఇవ్వాలని కోరుతూ నటి రాగిణి ద్వివేది న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. జారి పడినప్పుడు నడుము, వెన్నుకు దెబ్బలు తగిలాయని వాపోయారు. కారాగారంలోని వైద్యశాలలోనే చికిత్స ఇస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి ఉపశమనం లభించలేదన్నారు.
'కారాగారంలో గాయపడ్డా.. చికిత్సకు అనుమతివ్వండి' - కారాగారంలో గాయపడ్డ రాగిణి
డ్రగ్స్ కేసులో అరెస్టయిన నటి రాగిణి.. కారాగారంలో జారిపడి గాయపడ్డట్లు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సకు అవకాశం కల్పించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
'కారాగారంలో గాయపడ్డా.. చికిత్సకు అనుమతివ్వండి'
కారాగారం వెలుపల వైద్యశాలలో చికిత్సకు అవకాశం కల్పిస్తూ ఆదేశాలు ఇవ్వాలని సీసీబీ ప్రత్యేక న్యాయస్థానానికి వినతిని సమర్పించారు రాగిణి. డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆమె న్యాయనిర్బంధం 23వ తేదీ వరకు కొనసాగనుంది. అర్జీని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, దీనిపై ఆక్షేపణలను దాఖలు చేసేందుకు సీసీబీ పోలీసులకు అవకాశం కల్పిస్తూ విచారణను వాయిదా వేసింది.