'పలాస' చిత్రంలోని 'నాదీ నక్కిలీసు గొలుసు', 'బావొచ్చాడు' వంటి జానపద గీతాలతో శ్రోతల్ని విశేషంగా అలరించారు రఘు కుంచె. ఆయన సంగీత సారథ్యంలో 'వచ్చిందిరా వచ్చిందిరో' అంటూ సాగే మరో ఫోక్ సాంగ్ రూపుదిద్దుకుని, తాజాగా విడుదలైంది. స్వీయ రచనలో ఈ గీతాన్ని అసిరయ్య ఆలపించారు. గిరిధర్ రాగోలు ర్యాప్ అందించగా రఘు కుంచె ఆలపించారు.
'వచ్చిందిరా' జానపదం.. శ్రోతలను ఆకట్టుకుంటూ..! - రఘుకుంచె మరో జానపదం
'నాది నక్కిలీసు గొలుసు' వంటి జానపద గీతంతో అలరించిన రఘు కుంచె మరోసారి 'వచ్చిందిరా వచ్చిందిరో' అంటూ సాగే ఫోక్ సాంగ్‌ను రూపొందించారు. తాజాగా ఈ పాటను విడుదల చేసింది చిత్రబృందం.
వచ్చిందిరా
'బ్యాచ్' సినిమా కోసం ఈ ప్రయత్నం చేశారు రఘు కుంచె. రేసుగుర్రం, దువ్వాడ జగన్నాథం, మళ్లీరావా తదితర చిత్రాల్లో బాల నటుడిగా మెరిసిన సాత్విక్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రమిది. నేహా పఠాన్ నాయిక. శివ దర్శకత్వం వహిస్తున్నారు. కాలేజీ నేపథ్యంలో సాగే కథ ఇది.
ఇవీ చూడండి: జిమ్ వీడియోతో ఊర్వశి.. నెటిజన్లు షాక్
Last Updated : Jun 12, 2021, 8:43 AM IST