'ఓం నమో వేంకటేశాయ' సినిమా తర్వాత మరో చిత్రం చేయలేదు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఈ చిత్రం విడుదలై రెండేళ్లు పూర్తి అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన దాదాపు సినిమాల నుంచి విరామం తీసుకున్నట్లు వార్తలొచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం దర్శకేంద్రుడు త్వరలోనే ఓ ప్రాజెక్టును పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథలు వినడం మొదలుపెట్టారట. ప్రస్తుతం ఆయనకు స్టోరీ లైన్ వినిపిస్తున్న వాళ్లలో యువ రచయితలతో పాటు పలువురు అగ్ర రైటర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో బీవీఎస్‌ఎన్ రవి కూడా ఓ కథ చెప్పగా.. అది దర్శకేంద్రుడికి బాగా నచ్చిందట. మరోవైపు రాఘవేంద్రరావు వద్ద కూడా 'పెళ్లి సందడి' టైపులో ఓ చక్కటి కథ ఉన్నట్లు సమాచారం అందుతోంది.