ఇటీవలే దర్శకుడిగా 45 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు రాఘవేంద్రరావు. తన తండ్రి ప్రకాశ్ దగ్గర దర్శకత్వ మెళకువలు నేర్చుకున్న ఆయన 'బాబు' చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆయనది. రాఘవేంద్రరావు అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది పువ్వులు, పళ్లు. అవి చెట్టుకు ఉన్నప్పటికంటే హీరోయిన్ల నాభీపై పడుతూ.. తన కెమెరాకు చిక్కినప్పుడు అందంగా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదేమో. అంతగా తెరపై తనదైన ముద్ర వేశారు.
ఓ నాయిక బొడ్డుపై ద్రాక్ష పండు.. మరో భామపై యాపిల్ పండు.. ఇలా ప్రకృతి ప్రసాదించిన పళ్లన్నీ తన సినిమాల్లోని పాటల కోసం వినియోగించారు. నాయికలను అందంగా చూపించి వారికి మంచి గుర్తింపు తీసుకొచ్చారు. అందుకే చాలామంది భామలు ఆయన దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇంతకీ రాఘవేంద్రరావు పూలు, పళ్లు చూపించే ఒరవడి ఎప్పుడు, ఎలా మొదలైందో తెలుసా.