తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పెళ్లిసంద...డి' లిరికల్​ సాంగ్​ రిలీజ్​ డేట్​ - pellisandadi raghavendrarao

కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ కథానాయకుడిగా రానున్న చిత్రం 'పెళ్లిసంద...డి'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ లిరికల్‌ వీడియో ప్రకటనకు సంబంధించిన చిన్న వీడియోను పంచుకుంది చిత్రబృందం.

Pellisandai
పెళ్లిసంద...డి

By

Published : Apr 27, 2021, 1:32 PM IST

పాతికేళ్ల కిందట కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం పెళ్లిసందడి. శ్రీకాంత్‌ కథానాయకుడిగా నటించారు. అప్పట్లో ఘన విజయం సాధించిన ఆ చిత్రం పేరుతో మరోసారి ఇప్పుడు పెళ్లిసంద...డి తెరకెక్కుతోంది. ఇందులో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ లిరికల్‌ వీడియో ప్రకటనకు సంబంధించిన చిన్న వీడియోను పంచుకుంది.

మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. చిత్రీకరణ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని పాటను ఈ నెల 28న విడుదల చేయనున్నారు.

ఏప్రిల్‌ 28కి ఓ ప్రత్యేకత ఉంది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అడవిరాముడు విడుదలైన రోజు. ఆయన సమర్పణలో రూపొందిన బాహుబలి: ది కన్‌క్లూజన్‌ విడుదలైందీ అదే రోజు. అందుకే పెళ్లిసంద...డి పాటను ఆ రోజున విడుదల చేయాలని నిర్ణయించినట్టు సినీ వర్గాలు తెలిపాయి. "ఇది కొత్త కథతో తెరకెక్కుతున్న చిత్రం. నాటి పెళ్లి సందడికి కొనసాగింపు చిత్రం కాదు. రొమాంటిక్‌ మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ నెల 28న విడుదల కానున్న పాటతో కె.రాఘవేంద్రరావు - కీరవాణి స్వరాల సందడి మళ్లీ మొదలవుతుంద"ని సినీ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.

ABOUT THE AUTHOR

...view details