శర్వానంద్, సమంత జంటగా నటించిన చిత్రం 'జాను'. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దిల్‌రాజు నిర్మాత. ఇటీవల విడుదలైన చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో చిత్రబృందం విజయోత్సవాన్ని నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా దర్శకుడు కె.రాఘవేంద్రరావు విచ్చేశారు. చాలా కాలం తర్వాత ఓ మంచి ప్రేమకథ చూసినట్లు తెలిపారు.
"శర్వా, సమంత పోటీ పడి నటించారు. క్లైమాక్స్ చూస్తే ఏడుపొచ్చింది. ఈ సినిమా చూసిన వాళ్లందరికీ తమ స్కూలు రోజులు గుర్తొస్తాయి. నా కాలేజీ, స్కూలు జీవితాల్లో అమ్మాయిలే లేరు. సినిమాల్లోకి వచ్చాక అమ్మాయిలే.. అమ్మాయిలు."( చమత్కారంగా)