ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. 'పెళ్లి సందడి' అనే పేరు ఖరారు చేసినట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ఓ వీడియో పంచుకున్నారు. తనదైన శైలిలో రూపొందించిన ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కె.రాధామోహనరావు ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా ఆర్కా మీడియా వర్క్ సంస్థ నిర్మిస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. నాయకానాయిక, ఇతర తారాగణం వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
'పెళ్లి సందడి' మళ్లీ మొదలవబోతుంది - రాఘవేంద్ర రావు కొత్త సినిమా
ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు తన కొత్త చిత్ర ప్రకటన చేశారు. ఇంతకుముందు ఆయన రూపొందించిన 'పెళ్లి సందడి' టైటిల్‌తో మరో సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని రాఘవేంద్ర రావు ఈరోజు అధికారికంగా ప్రకటించారు.
'పెళ్లి సందడి' మళ్లీ మొదలవుతుంది
శ్రీకాంత్ కథానాయకుడిగా గతంలో రాఘవేంద్రరావు 'పెళ్లి సందడి' సినిమా తెరకెక్కించారు. మంచి విజయం అందుకుందా చిత్రం. మరోసారి అదే టైటిల్‌నే ఎంపిక చేసుకోవడం వల్ల అందరిలో ఆసక్తి పెరిగింది. అయితే ఈ కొత్త టైటిల్‌లో 'డి' అనే అక్షరాన్ని ఆంగ్లంలో పెట్టడానికి కారణమేంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.