ప్రముఖ నృత్య, సినీ దర్శకుడు, నటుడు రాఘవా లారెన్స్ సరైన సమయానికి స్పందించి, నిండు గర్భిణి ప్రాణాలు కాపాడారు. తన సాయం కోరిన కుటుంబానికి అండగా నిలిచి, మంచి మనసు చాటుకున్నారు. ఈ విషయాన్ని అతడే స్వయంగా తెెలిపారు.
"ఈ శుభవార్త మీతో పంచుకోవాలి. రెండు రోజుల క్రితం నాకు తెలిసిన ఓ మహిళకు కరోనా వైరస్ సోకిందని తెలిసింది. ఆమె నిండు గర్భిణి, డెలివరీ స్టేజ్‌లో ఉన్నారు. ఆమె భర్త, మామ నాకు ఫోన్ చేసి సాయం అడిగారు. దీంతో ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్ పీఏ రవి సర్‌ను సంప్రదించా. ఆయన వెంటనే స్పందించి.. గర్భిణిని కేఎమ్‌సీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు కరోనా వైరస్ ఉందని తెలుసుకున్న వైద్యులు అన్నీ జాగ్రత్తలు తీసుకుని.. ఆపరేషన్ చేశారు. ఆమెకు మగశిశువు జన్మించింది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. కరోనాను జయిస్తానని ఆమె నాకు మాటిచ్చింది. ఈ విషయంలో సాయం చేసిన ఆరోగ్య శాఖ మంత్రికి ధన్యవాదాలు. వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. మీరంతా దేవుళ్లతో సమానం"