బాలీవుడ్ చిత్రం 'లక్ష్మీబాంబ్' సంబంధించిన వివాదం సద్దుమణిగింది. అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్న ఈ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు దర్శకుడు రాఘవ లారెన్స్. ట్విట్టర్ వేదికగా శనివారం ఈ విషయాన్ని పంచుకున్నాడు. 2011లో వచ్చిన 'కాంచన'కు రీమేక్‌గా వస్తుందీ చిత్రం. కియారా అడ్వాణీ హీరోయిన్.
"మళ్లీ దర్శకుడిగా బాధ్యతులు తీసుకున్నా. లక్ష్మీ బాంబ్ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్నా. నా బాధని అర్థం చేసుకున్న హీరో అక్షయ్ కుమార్‌కు ధన్యవాదాలు." -రాఘవ లారెన్స్, దర్శకుడు