తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సూపర్​స్టార్​ 'దర్బార్​'కు 'కాంచన' గ్యాంగ్​ - kanchana 3

రాఘవ లారెన్స్ ముంబయిలో రజినీని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

రాఘవ, రజినీ

By

Published : May 1, 2019, 1:27 PM IST

'కాంచన 3’' సినిమాతో ఘనవిజయం అందుకున్నాడు రాఘవ లారెన్స్. 'ముని' సిరీస్​లో నాల్గొవ చిత్రంగా వచ్చి ప్రేక్షకుల మెప్పు పొందింది. 100 కోట్ల క్లబ్బులో చేరి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా రాఘవ లారెన్స్, హీరోయిన్ వేదిక సూపర్ స్టార్ రజినీకాంత్​ను కలిశారు. ఈ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి గురువు ఆశీర్వాదం తీసుకున్నామంటూ తెలిపాడు.

ప్రస్తుతం 'దర్బార్' షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. రాఘవ లారెన్స్, హీరోయిన్ వేదికతో పాటు రజినీని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

'కాంచన' చిత్రం ఘన విజయం సాధించగా.. బాలీవుడ్​లోనూ రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి 'లక్ష్మీబాంబ్' అనే టైటిల్ ఖరారు చేశారు.

ఇవీ చూడండి.. విక్రమ్​ కోసం పాట పాడిన శృతిహాసన్​

ABOUT THE AUTHOR

...view details