తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రంగస్థలం'లో రామ్​చరణ్​ స్థానంలో లారెన్స్​! - రంగస్థలం తమిళ రీమేక్

రామ్​చరణ్​ కెరీర్​లో సూపర్​ హిట్​గా నిలిచిన రంగస్థలం చిత్రం త్వరలో తమిళంలో రీమేక్​ కాబోతుంది. ఈ సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.

రంగస్థలం

By

Published : Nov 4, 2019, 6:55 PM IST

రంగస్థలం.. రామ్​చరణ్​ కెరీర్​లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. గత ఏడాది అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా తమిళంలో రీమేక్​ కాబోతుంది. అయితే కోలీవుడ్​లో రాఘవ లారెన్స్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. లింగుస్వామి దర్శకత్వం వహించనున్నట్లు ఫిల్మ్​వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే రంగస్థలం తమిళ రీమేక్​కు లారెన్స్ సంతకం చేశాడని, త్వరలోనే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వస్తుందని సినీవర్గాల సమాచారం. మరి లింగుస్వామి - లారెన్స్ కాంబినేషన్​లో రంగస్థలం ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

తెలుగులో రంగస్థలం చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించాడు. కాంచన రీమేక్​తో బాలీవుడ్​లో అడుగుపెడుతున్నాడు రాఘవ లారెన్స్. అక్షయ్​ కుమార్​ హీరోగా 'లక్ష్మీబాంబ్' పేరుతో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ముగిసింది.

ఇదీ చదవండి: తొలి హాకీ ప్లేయర్​గా సందీప్ కిషన్..!

ABOUT THE AUTHOR

...view details