ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ కథానాయకుడు, దర్శకుడిగా నిరూపించుకున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు తెరకెక్కించడంలో ట్రెండ్ సెట్ చేశాడు. ఎక్కువగా స్వీయ దర్శకత్వంలోనే నటించడానికి ఇష్టపడే అతడు ఇతర దర్శకులతోనూ పని చేసేందుకు సిద్ధమయ్యాడు.
'సరోజ', 'గాంబ్లర్', 'బిరియాని' చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వెంకట్ ప్రభు.. లారెన్స్‌తో ఓ సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే లారెన్స్‌కు కథ వినిపించాడని, లారెన్స్ కూడా సుముఖంగా ఉన్నాడని తెలుస్తోంది. తాజాగా వీరిద్దరు కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్లో పంచుకున్నాడు వెంకట్.