తెలంగాణ

telangana

ETV Bharat / sitara

త్వరలో 'చంద్రముఖి 2'... కీలక పాత్రలో లారెన్స్​! - Rajinikanth's 2005 horror comedy chandramukhi sequel

హారర్ సినిమా 'చంద్రముఖి'కి త్వరలో సీక్వెల్​ రానుందని దర్శకుడు పి.వాసు వెల్లడించారు. ఇందులో నటుడు-కొరియోగ్రాఫర్ లారెన్స్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

Raghava Lawrence announces Chandramukhi 2, sequel to Rajinikanth's 2005 horror comedy
త్వరలో 'చంద్రముఖి 2'... కీలక పాత్రలో లారెన్స్​

By

Published : May 2, 2020, 5:20 AM IST

Updated : May 2, 2020, 7:32 AM IST

సూపర్​స్టార్ రజనీకాంత్​ నటించిన 'చంద్రముఖి' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మలయాళ సినిమా 'మణిచిత్రతాళు' ఆధారంగా రూపొందిన సినిమా.. విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ప్రముఖ దర్శకుడు పి.వాసు దీనిని తెరకెక్కించారు. అప్పట్లో తెలుగు, తమిళంలో ప్రభంజనం సృష్టించిందీ చిత్రం. ఇప్పుడు మరోసారి అదే రీతిలో భయపెట్టేందుకు సిద్ధమవుతూ, సీక్వెల్​ను సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్​ స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఈ సీక్వెల్​కు సంబంధించిన స్క్రిప్టును వాసు పూర్తి చేశారని సమాచారం. అయితే ఇందులో రాఘవ లారెన్స్‌ ఓ ప్రత్యేక పాత్ర పోషించనున్నాడని టాక్ వినిపిస్తోంది. చంద్రముఖిని చంపే దుష్టరాజు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.‌ పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

Last Updated : May 2, 2020, 7:32 AM IST

ABOUT THE AUTHOR

...view details