తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రొమాంటిక్‌ సీన్స్‌లో చాలాసార్లు టెంప్ట్‌ అయ్యా - cinema

ఈ మధ్య బోల్డ్ స్టేట్​మెంట్స్​తో సినీ ప్రియులను అవాక్కయ్యేలా చేస్తున్న బాలీవుడ్ నటి రాధికా ఆప్టే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇచ్చిన సమాధానంతో మరోసారి వార్తల్లో నిలిచింది.

రాదిక ఆప్టే

By

Published : Jun 30, 2019, 11:06 PM IST

కొన్నాళ్ల క్రితం వరకు బాలీవుడ్‌లో బోల్డ్‌ బ్యూటీ అన్నా.. బోల్డ్‌ స్టేట్‌మెంట్లకు చిరునామా ఎవరు అన్న ప్రశ్న తలెత్తినా ప్రతి ఒక్కరికీ వెంటనే గుర్తొచ్చే పేరు విద్యాబాలనే. కానీ, ఇప్పుడీ పేరు తనకు మాత్రమే సరిపోతుంది అన్నట్లుగా చెలరేగిపోతుంది రాధికా ఆప్టే.

తెలుగులో ‘రక్తచరిత్ర’, ‘లెజెండ్‌’ వంటి చిత్రాల్లో పద్ధతిగా కనిపించి మురిపించిన ఈ అమ్మడు.. బాలీవుడ్‌కు వెళ్లాక పూర్తి బోల్డ్‌ ప్రదర్శనతో మతులు పోగొట్టడం షురూ చేసింది. కేవలం ఆ బోల్డ్‌నెస్‌ తన చేతల్లోనే కాదు.. అప్పుడప్పుడూ మాటల్లోనూ చూపిస్తూ సినీప్రియులను అవాక్కయ్యేలా చేస్తుంటుంది. తాజాగా ఈ భామ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రొమాంటిక్ సీన్స్‌పై మతిపోగొట్టే సమాధానమిచ్చింది.

3707293_thumbnail_3x2_radika.jpg

‘‘రొమాంటిక్‌ సన్నివేశాలు చేస్తున్నప్పుడు మీరు టెంప్ట్‌ అయిన సందర్భాలేమైనా ఉన్నాయా’’ అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి రాధికను ప్రశ్నించగా.. దానికి ఆమె తనదైన శైలిలో.. ‘‘అవును. అలా నేను టెంప్ట్‌ అయిన సందర్భాలు నా కెరీర్‌లో చాలానే ఉన్నాయి. వాస్తవానికి రొమాంటిక్ సీన్స్‌లో అలా టెంప్ట్‌ అయితేనే ఆ సన్నివేశం మరింత బాగా పండుతుందనేది నా అభిప్రాయం. కానీ, ఇవన్నీ నటనలో భాగమని తేలికగా తీసుకోలేం’’ అంటూ బోల్డ్‌గా సమాధానమిచ్చింది.

ఇవీ చూడండి.. కియారాకు విజయ్ దేవరకొండ బహుమతి

ABOUT THE AUTHOR

...view details