తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శర్వా చిత్రంలో ముగ్గురు స్టార్​​ నటీమణులు - ఆడవాళ్లు మీకు జోహార్లు ఖుష్బు

శర్వానంద్‌, రష్మిక జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈ చిత్రంలో చాలా కాలం తర్వాత ముగ్గురు సీనియర్‌ నటీమణులు కనిపించనున్నారు. వారెవరంటే?

Adavallu miku Joharlu
శర్వానంద్​

By

Published : Aug 3, 2021, 3:48 PM IST

Updated : Aug 3, 2021, 4:20 PM IST

శర్వానంద్‌, రష్మిక జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురు సీనియర్‌ నటీమణులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వాళ్లే రాధిక, ఖుష్బూ, ఊర్వశి. వినూత్నమైన ఈ కథకి ఈ ముగ్గురు తారల్ని ఎంపిక చేసినట్టు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది చిత్ర బృందం.

ఒక్క సీనియర్‌ నటి ఉంటేనే ఆయా చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. అలాంటిది ఒకే చిత్రంలో ముగ్గురు ఎవర్‌గ్రీన్‌ తారలు నటిస్తుండటం వల్ల ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. 'అజ్ఞాతవాసి' తర్వాత ఖుష్బూ, 'రాజా ది గ్రేట్‌' తర్వాత రాధిక, 'రాజు గారి గది 3' తర్వాత ఊర్వశి నటిస్తున్న తెలుగు చిత్రమిదే. చాలాకాలం తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు వీరు సిద్ధమయ్యారు.

మరి వీళ్లు ఈ చిత్రంలో ఎలాంటి పాత్రలు పోషిస్తున్నారో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై చెరుకూరి సుధాకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.

ఇదీ చూడండి: ఆడవాళ్లూ.. అందుకోండి జోహార్లు

Last Updated : Aug 3, 2021, 4:20 PM IST

ABOUT THE AUTHOR

...view details