'కేజీఎఫ్'తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు యశ్. ఈ రోజు అతడి పుట్టినరోజు సందర్భంగా తన భార్య రాధికా పండిట్.. ఈ కన్నడ హీరోకు వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు చెప్పింది. కూతురుతో కలిసి కేక్ తయారు చేస్తూ.. వీడియో రూపొందించి అతడికి బర్త్ డే విషెస్ చెప్పింది.
'సర్ప్రైజ్ మా ప్రాణానికి ప్రాణమైన రాకింగ్స్టార్కు నీ బిగ్గెస్ట్ ఫ్యాన్స్ నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు' అని కూతురుతో కలిసి యశ్‌కు విషెస్ చెప్పింది రాధిక. ఈ వీడియోను ట్విట్టర్లో పంచుకున్నాడీ కన్నడ హీరో. ఈ రోజుతో యశ్‌కు 34 ఏళ్లు నిండాయి.