ప్రముఖ బాలీవుడ్ కథానాయిక రాధికా ఆప్టే దర్శకురాలిగా తెరకెక్కించిన మొదటి షార్ట్ ఫిల్మ్ 'ద స్లీప్ వాకర్స్'. తాజాగా ఈ ఏడాది ఆన్లైన్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో.. ఈ చిత్రం ఉత్తమ మిడ్నైట్ షార్ట్ అవార్డు దక్కించుకుంది. ఈ పురస్కారానికి ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. సంతోషం వ్యక్తం చేసింది రాధిక.
ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధిక మాట్లాడుతూ.. డైరెక్టర్గా వ్యవహరించడం ఆనందంగా ఉందని.. భవిష్యత్తులో మరిన్ని చిత్రాలను తెరకెక్కించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది.