తెలంగాణ

telangana

By

Published : Dec 27, 2019, 1:25 PM IST

Updated : Dec 27, 2019, 1:37 PM IST

ETV Bharat / sitara

నా కంటే చిన్నవాడితో డేట్​కు వెళ్లలేదు: రాధిక

'లెజెండ్', 'లయన్'​ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి రాధికా ఆప్టే. తన జీవితంలో జరిగిన డేట్​ గురించిన ఆసక్తికర విషయం వెల్లడించింది.

నా కంటే చిన్నవాడితో డేట్​కు వెళ్లలేదు: రాధిక
నటి రాధికా ఆప్టే

విభిన్న పాత్రలతో, వివాదాస్పద వ్యాఖ్యలతో హీరోయిన్​గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది నటి రాధికా ఆప్టే. తన అందంతో యువతను కట్టిపడేసే ఈ భామ.. వయసులో తనకంటే చిన్న వాడితో ఎప్పుడూ డేట్​కు వెళ్లలేదని చెబుతోంది.

వెబ్​ సిరీస్​లతో ఆకట్టుకుంటూ..
దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్​లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న రాధిక.. ప్రస్తుతం వెబ్​ సిరీస్​లతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఇటీవలే నెట్​ఫ్లిక్స్​లో ప్రసారమయ్యే ఓ కార్యక్రమానికి అతిథిగా వచ్చింది. అందులో పలు ఆసక్తికర విషయాలను చెప్పింది.

"వయసులో నాకంటే చిన్నవాడితో ఎప్పుడూ డేట్​కు వెళ్లలేదు. నాకు ఇప్పటికీ బాగా గుర్తు.. ఒకానొక సమయంలో ఇద్దరు అబ్బాయిలు నన్ను డేట్​కు రమ్మని పిలిచారు. అందులో ఒకతను నాకంటే వయసులో చిన్నవాడు. వాళ్లిద్దరూ డేట్​కు రమ్మంది ఒకే రోజు. ఒకే సమయం. నాకేం చేయాలో తోచలేదు. అప్పుడు మా ఇంటికి ప్రతిరోజూ ఒక పిల్లి వస్తుండేది. దానికి నేను ఓ చేప పిల్లను ఆహారంగా అందించేదాన్ని. వాళ్లు రమ్మని అడిగినప్పుడు.. నేను ఇంటికి వెళ్లి పిల్లికి చేపను ఆహారంగా అందించా. ఒకవేళ అది చేపను తింటే ఒక అబ్బాయితో.. తినకపోతే నాకంటే చిన్నవాడితో వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఆ రోజు పిల్లి చేపను తింది. అలా నేను ఒకబ్బాయితో డేట్​కు వెళ్లా. తర్వాత అతన్నే ప్రేమించి పెళ్లి చేసుకున్నా. తనే నా భర్త బెనిడిట్క్​"
- రాధికా ఆప్టే, నటి

ప్రస్తుతం రాధిక.. 'ద వెడ్డింగ్ గెస్ట్', 'ద ఆశ్రమ్'​ అనే హాలీవుడ్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తోంది.

ఇదీ చదవండి: ఈ సినిమా మా అమ్మకు అంకితం: కంగనా

Last Updated : Dec 27, 2019, 1:37 PM IST

ABOUT THE AUTHOR

...view details