*'రాధే' సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఇందులో అండర్ కవర్ పోలీస్‌గా సల్మాన్‌ఖాన్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. దిశా పటానీ హీరోయిన్గా నటిస్తుండగా, రణ్‌దీప్ హుడా విలన్‌గా చేస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ఈద్ కానుకగా మే 13న థియేటర్లతో పాటు పే ఫర్ వ్యూ విధానంలో ఒకేసారి విడుదల కానుందీ సినిమా.
'రాధే' ట్రైలర్‌తో సల్మాన్.. 'పంచతంత్రం'లో బ్రహ్మానందం - మూవీ న్యూస్
కొత్త సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. వీటిలో 'రాధే', 'పంచతంత్రం', 'కోతి కొమ్మచ్చి' చిత్రాల సంగతులు ఉన్నాయి.
!['రాధే' ట్రైలర్‌తో సల్మాన్.. 'పంచతంత్రం'లో బ్రహ్మానందం movie updates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11494748-187-11494748-1619072567152.jpg)
'రాధే' ట్రైలర్‌తో సల్మాన్.. 'పంచతంత్రం' బ్రహ్మానందం
*'కోతి కొమ్మచ్చి' సినిమా థీమ్ సాంగ్.. రేపు ఉదయం రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు దీనిని విడుదల చేయనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీస్తున్న ఈ సినిమాకు 'శతమానం భవతి' ఫేమ్ సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు.
*'పంచతంత్రం' సినిమా టైటిల్ సహా అందులో నటిస్తున్న వారిని పరిచయం చేశారు అడివి శేష్. ఈ చిత్రంలో బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, శివాత్మిక, రాహుల్ విజయ్, సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నారు.