తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Radhe Shyam News: ప్రభాస్ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్ - ప్రభాస్ మూవీ అప్డేట్స్

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రాధేశ్యామ్' అప్డేట్​కు రంగం సిద్ధమైంది. మరో మూడు రోజుల్లో దానిని విడుదల చేయనున్నారు.

radhe shyam update
రాధేశ్యామ్ మూవీ అప్డేట్

By

Published : Jul 29, 2021, 7:25 AM IST

డార్లింగ్ ప్రభాస్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న 'రాధేశ్యామ్' అప్డేట్ త్వరలో రానుంది. ఈ విషయాన్ని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ స్వయంగా వెల్లడించారు. ట్విట్టర్​లో ఆ విషయాన్ని పోస్ట్ చేశారు.

"మరో మూడు రోజుల్లో అఫీషియల్ అప్డేట్.. లెట్స్ వెయిట్. చివరి షెడ్యూల్ పూర్తయింది" అని రాధాకృష్ణ కుమార్ ట్వీట్ చేశారు.

రాధాకృష్ణ కుమార్ ట్వీట్

1970ల నాటి కథతో యూరప్ నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్ సరసన పూజాహెగ్దే హీరోయిన్​గా నటించింది. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, టీజర్లు అభిమానుల్ని అలరిస్తున్నాయి.

రాధేశ్యామ్​లో ప్రభాస్, పూజాహెగ్డే

దసరాకా? సంక్రాంతికా?

అయితే 'రాధేశ్యామ్' విడుదల తేదీ గురించి ఈ అప్డేట్ ఉంటుందా? లేదా పాటలు ఏమైనా విడుదల చేస్తారో చూడాలి. శుక్రవారం(జులై 30) నుంచి కొత్త సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. ఆగస్టు, సెప్టెంబరు నెలలో పలు చిత్రాలు ఇప్పటికే విడుదల తేదీలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఫలితంగా 'రాధేశ్యామ్'​ దసరాకు వస్తుందా? సంక్రాంతికి వాయిదా పడుతుందా? అనేది తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details