తెలంగాణ

telangana

ETV Bharat / sitara

''రాధేశ్యామ్'.. నన్ను డిఫరెంట్​ మూడ్​లోకి తీసుకెళ్లింది'

Radhe shyam thaman: 'రాధేశ్యామ్' బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ అద్భుతంగా వచ్చిందని తమన్ చెప్పారు. ఈ సినిమా తనను డిఫరెంట్​ మూడ్​లోకి తీసుకెళ్లిందని అన్నారు. వింటేజ్​ ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రం.. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

radhe shyam movie thaman
రాధేశ్యామ్ మూవీ తమన్

By

Published : Feb 7, 2022, 12:06 PM IST

Thaman prabhas Radhe shyam: తమన్.. ప్రస్తుతం తెలుగులో మోస్ట్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్. ప్రస్తుతం అతడి చేతిలో డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వాటిలో చిరు, పవన్​ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు ఉన్నాయి. ఇవే కాకుండా తమన్.. 'రాధేశ్యామ్', 'డీజే టిల్లు' సినిమాలు బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ కూడా అందిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్.. ప్రభాస్ 'రాధేశ్యామ్' గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.

"నన్ను 'రాధేశ్యామ్'.. ఓ డిఫరెంట్ మూడ్​లోకి తీసుకెళ్లింది. ఓ అద్భుతమైన ప్రేమకథ ఇది. ఇది అన్​స్టాపబుల్ చిత్రమని నా ఫీలింగ్. ప్రేమ ఉంటే, అది నిజమైతే 'రాధేశ్యామ్' సక్సెస్​ఫుల్ ఫిల్మ్ అవుతుంది" అని తమన్ చెప్పారు.

రాధేశ్యామ్ మూవీలోని సీన్

"రాధేశ్యామ్' సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ ఇప్పటికే అద్భుతమైన పాటలు ఇచ్చాడు. నాకు జీవితంలో చేయడానికి సినిమాలు లేని టైమ్​లో యూవీ క్రియేషన్స్ వంశీ-ప్రమోద్-విక్కీ నాకు అవకాశమిచ్చారు. 'మహానుభావుడు', 'భాగమతి' సినిమాలతో నాకు ఆక్సిజన్ ఇచ్చారు. దానికి గుర్తుగానే 'రాధేశ్యామ్'కు బ్యాక్​గ్రౌండ్​తో వాళ్లకు ప్రేమను తిరిగిచ్చాను" అని తమన్ తెలిపారు.

"మహానుభావుడు, భాగమతి సినిమాల తర్వాత నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. ఇదంతా జరగడానికి కారణం యూవీ క్రియేషన్స్. అందుకే వాళ్లకు కృతజ్ఞత చూపించాలని అనుకున్నాను. ఈ క్రమంలోనే 'రాధేశ్యామ్' చేశాను. దీనికి బ్యాక్​గ్రౌండ్​ ఔట్​పుట్ చాలా బాగా వచ్చింది" అని తమన్ చెప్పుకొచ్చారు.

ప్రభాస్ 'రాధేశ్యామ్' రిలీజ్ డేట్

1970ల కాలం నాటి ప్రేమకథతో రూపొందిన చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా నటించారు. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజాహెగ్డే కనిపించనుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మార్చి 11న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details