Radhe Shyam Song Update: 'రాధేశ్యామ్' గీతం.. అన్ని భాషల్లో కలిపి 50 మిలియన్ వ్యూస్ సాధించింది. తెలుగులో 'నగుమోము తారలే', హిందీలో 'ఆషికీ ఆగయి' అంటూ సాగుతున్న ఈ గీతం.. సంగీత ప్రియుల్ని తెగ అలరిస్తోంది.
ఈ సినిమాలో ప్రభాస్- పూజా హెగ్డే జంటగా నటించారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించగా, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
ఇటీవల మరణించిన ప్రముఖ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి గీతం.. మంగళవారం విడుదల కానుంది. 'శ్యామ్‌సింగరాయ్' సినిమాలోని ఈ గీతం.. 'సిరివెన్నెల' అనే లిరిక్స్‌తోనే ఉండటం మరో విశేషం.
వినూత్న కథాంశంతో తెరకెక్కిస్తున్న 'శ్యామ్‌సింగరాయ్' సినిమాలో నేచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయం చేశారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరయిన్లు. మిక్కీ జే మేయర్ సంగీతమందించగా.. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించారు. డిసెంబరు 24న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.